అన్నపూర్ణగా తెలంగాణ

- కాళేశ్వరంతో పెరిగిన సాగువిస్తీర్ణం
- కాంగ్రెస్ నేతలు కళ్లు తెరిచి చూడాలి
- 15న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు విస్తృత స్థాయి సమావేశం
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి టౌన్, ఫిబ్రవరి 12 : కాళేశ్వరం ప్రాజెక్టుతో అన్నపూర్ణగా తెలంగాణ మారిందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని తెలిపారు. ఎస్సారెస్పీ ద్వారా చెరువులు నిండుతున్నాయని, భూముల ధరలు ఒక్కసారిగా మూడింతలు పెరిగాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ప్రతిపక్ష నాయకులు తమ హోదాకు తగినట్లు హుందాగా మాట్లాడాలని, అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ నెల 15న భూపాలపల్లిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఏఎస్ఆర్ గార్డెన్లో విస్తృత స్థాయి సమావేశం ఉంటుందన్నారు. సమావేశానికి సభ్యత్వ నమోదు ఇన్చార్జిలు నారదాసు లక్ష్మణ్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తేదీ ఖరారు కావడంతో నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపునకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీసిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌కుమార్ యాదవ్, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి, నేతలు దార పూలమ్మ, మంగళంపల్లి తిరుపతి, పిల్లలమర్రి నారాయణ, ముంజాల రవి, థమ్సప్ రాంగోపాల్, బండారి రవి, తాటి అశోక్, నాగవెళ్లి రాజలింగమూర్తి, బడితెల సమ్మయ్య, దొంగల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.