సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Feb 14, 2021 , 02:09:00

మృతుడి కుటుంబానికి అండగా ఉంటాం

మృతుడి కుటుంబానికి అండగా ఉంటాం

  • ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి 

ఏటూరునాగారం, ఫిబ్రవరి 13 : టీఆర్‌ఎస్‌ కార్యకర్త కుసుమ రాజ్‌కుమార్‌ కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఏటూరునాగారంలో శనివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల బహిరంగ సభకు హాజరై చిన్నబోయినపల్లి గ్రామానికి వెళ్తున్న క్రమంలో రాజ్‌కుమార్‌ ద్విచక్ర వాహనంపై నుంచి పడి ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ ఎంజీఎంకు వెళ్లారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ కార్యకర్త కుటుంబానికి అండగా ఉండి ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు స్థానిక వైస్‌ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి తెలిపారు. వారి వెంట మేడారం ట్రస్టుబోర్డు చైర్మన్‌ ఆలం రామ్మూర్తి,  నాయకులు జీ కృష్ణారెడ్డి, భాస్కర్‌, శ్రీనివాస్‌, తదితరులు ఉన్నారు.


VIDEOS

logo