ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jayashankar - Feb 14, 2021 , 02:09:02

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే గండ్ర పరామర్శ

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే గండ్ర పరామర్శ

రేగొండ, ఫిబ్రవరి 13 : మండల కేంద్రానికి చెందిన పలు బాధిత కుటుంబాలను శనివారం రాత్రి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమాణారెడ్డి పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. మండల కేంద్రానికి చెందిన ఎండీ సలీంపాషా అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా, మడగాని కుమారస్వామి తాటి చెట్టుపై నుంచి పడి గాయపడ్డాడు. వారి కుటుంబాలను ఎమ్మె ల్యే పరామర్శించి అండగా ఉంటానన్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోడెం ఉమేష్‌గౌడ్‌, నాయకులు మైస భిక్షపతి, పట్టెం శంకర్‌, పత్తి భిక్షపతి, మండగాని రాంచందర్‌, శంకర్‌, భిక్షపతి, గౌస్‌పాషా, బండి వెంకటేశ్‌, బండారి శ్రీనివాస్‌, తాజొద్దీన్‌ తదితరులు ఉన్నారు.

VIDEOS

logo