ఆదివారం 07 మార్చి 2021
Jayashankar - Feb 13, 2021 , 02:20:00

ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించండి

ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించండి

కాటారం, ఫిబ్రవరి 12: వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్‌ అన్నారు. శుక్రవారం విలాసాగర్‌లో రైతులకు వరికి బదులు ఇతర పంటల సాగు పద్ధతులు, లాభాలపై అవగాహన కల్పించారు. పొలం గట్లపై నీలగిరి మొక్కలు పెంచితే మంచి ఆదాయం వస్తుందని అన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే వ్యవసాయ రంగంలో మంచి లాభాలు సాధించవచ్చని అన్నారు. జిల్లా ఉద్యానవన అధికారి అక్బర్‌ మాట్లాడుతూ పందిరి తీగ జాతి కూరగాయలు సాగు చేయడం ద్వారా రైతులు సంవత్సరం పొడవునా ఆదాయం పొందవచ్చన్నారు. బంతి పూలు, ఆయిల్‌ఫాం సాగు విధానం వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రమాదేవి నర్సింగరావు, రైతుబంధు మండల కోఆర్డినేటర్‌ రాజబాపు, ఏవో రామకృష్ణ, ఉపసర్పంచ్‌ సంతోష్‌,  ఏఈవో, రైతులు పాల్గొన్నారు.

VIDEOS

logo