మంగళవారం 02 మార్చి 2021
Jayashankar - Feb 12, 2021 , 02:18:51

చిన్నారిని చిదిమేసిన లారీ

చిన్నారిని చిదిమేసిన లారీ

  • రోడ్డుపై నిలుచొని ఉండగా దూసుకొచ్చిన టిప్పర్‌
  • ఐదేళ్ల మిల్కీ మృతితో మోరంచపల్లిలో విషాదం
  • ఒక్కగానొక్క బిడ్డ దూరమై గుండెలవిసేలా తల్లిదండ్రుల రోదన
  • ప్రధాన రహదారిపై కుటుంబసభ్యులు, గ్రామస్తుల ఆందోళన

ఐదేళ్ల మిల్కీని ఓ లారీ చిదిమేసింది. రోడ్డుపై నిలుచొని ఉండగా మృత్యువు రూపంలో దూసుకొచ్చి బలితీసుకుంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా  మోరంచపల్లిలో గురువారం ఉదయం జరిగిన ఈ హృదయ విదారక ఘటన గ్రామంలో విషాదం నెలకొంది. 

భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 11 : గ్రామంలోని ప్రధాన రోడ్డు పక్కన నిలుచు న్న ఓ చిన్నారిని లారీ (టిప్పర్‌ టీఎస్‌ 25 టీ 4000) బలిగొంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం మోరంచపల్లిలో గురువారం జరిగిన ఈ ప్రమాదం లో ముత్యాల మైత్రీజా అలియాస్‌ మిల్కీ (5) మృతిచెందడం స్థానికంగా విషాదం నింపింది. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన కు టుంబసభ్యులు, గ్రామస్తులు లారీ డ్రైవర్‌ను చితకబాదారు. పోలీసులు చేరుకుని డ్రైవర్‌ ను అదుపులోకి తీసుకున్నారు. సీఐ వాసుదేవరావు తెలిపిన వివరాల మేరకు.. మో రంచపల్లికి చెందిన ముత్యాల శివ, రోజా దంపతులకు మైత్రీజా ఒక్కతే కూతురు. ఇంటి ముందు రోడ్డుపై ఓ ఎన్నికల పాదయాత్ర వెళ్తుండగా చిన్నారి ఆ యాత్రను చూస్తూ నిలుచుంది.  ఈక్రమంలో  ఒక్కసారిగా అటువైపు వచ్చిన లారీ పాపపై నుంచి దూసుకెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే గ్రామస్తులు లారీని వెంబడించి ఆపి డ్రైవర్‌ సయ్యద్‌ అలీంను కిందికి దింపి తీవ్రంగా కొట్టారు. పోలీసులు చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నా రు. అనంతరం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గ్రామంలోని ప్రధాన రహదారిపై బై ఠాయించారు. సాయంత్రం వరకు ఆందోళ న చేపట్టారు. భూపాలపల్లి ఎస్‌ఐలు అభిన వ్‌, ఉదయ్‌, నరేశ్‌, ఘణపురం ఎస్‌ఐ రాజన్‌బాబు, రేగొండ ఎస్‌ఐ అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులో ఉంచారు. ఆర్డీవో శ్రీనివాస్‌ గ్రామస్తులు, కుటుంబసభ్యులతో మా ట్లాడారు. నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. చిన్నారి బాబాయి విష్ణు ఫిర్యాదుతో లారీ డ్రైవర్‌ అలీంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

VIDEOS

logo