గురువారం 25 ఫిబ్రవరి 2021
Jayashankar - Feb 11, 2021 , 02:40:34

మొక్కుబడిగా సమీక్ష

మొక్కుబడిగా సమీక్ష

కన్నాయిగూడెం, పిబ్రవరి 10:  మండల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం ఎంపీడీవో అడ్డూరి బాబు ఆధ్వర్యంలో కొద్ది మంది ప్రజాప్రతినిధులు, అధికారులతో మొక్కుబడిగా సమీక్ష నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ ఈనెల 17న సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ప్రతి జీపీ పరిధిలో వెయ్యి మొక్కలకు తగ్గకుండా నాటాలని కార్యదర్శులకు సూచించారు. పల్లెప్రగతిలో చేపట్టిన డంపింగ్‌ యార్డులు, సెగ్రిగేషన్‌ షెడ్లు, వైకుంఠధామల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో సర్పంచ్‌లు ప్రభాకర్‌, సాగర్‌, తహసీల్దార్‌ దేవాసింగ్‌, ఏవో నర్శింహారావు, ఎంపీవో కుమార్‌, ఈజీఎస్‌ ఈసీ కుమార్‌, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు పాల్గొన్నారు. 


VIDEOS

logo