మంగళవారం 09 మార్చి 2021
Jayashankar - Feb 10, 2021 , 01:15:12

రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి

రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి

భూపాలపల్లిటౌన్‌, ఫిబ్రవరి9: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ కళ్లెపు శోభ రఘుపతిరావు కోరారు. మంగళవారం భూపాలపల్లి మండలంలోని కొంపెల్లి గ్రామంలో నిర్మించిన రైతు వేదిక భవనంలో మొదటి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి జడ్పీ వైస్‌ చైర్మన్‌ కళ్లెపు శోభ, ఎంపీపీ మందల లావణ్య సాగర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భూపాలపల్లి క్లస్టర్‌కు చెందిన భూపాలపల్లి, కొంపెల్లి, గుడాడ్‌పల్లి గ్రామాలకు చెందిన రైతులు, రైతు బంధు సమితి సభ్యులు హాజరయ్యారు. రైతు వేదికల ద్వారా చేపట్టే కార్యక్రమాలు, వేదికల ఉపయోగాలను ఏఈవో కిరణ్మయి వివరించారు. అనంతరం జడ్పీ వైస్‌ చైర్మన్‌ మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు ఈ వేదికల ద్వారా ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తూ లబ్ధిపొందాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కాసగాని కవిత దేవేందర్‌, ఉప సర్పంచ్‌ కాయిత యుగేందర్‌ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం గ్రామంలో గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణీ చేశారు.


VIDEOS

logo