ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jayashankar - Feb 10, 2021 , 00:02:20

పల్లె ప్రగతిని పరిశీలించిన డీఎల్‌పీవో, ఎంపీడీవో, ఎంపీవో

పల్లె ప్రగతిని పరిశీలించిన డీఎల్‌పీవో, ఎంపీడీవో, ఎంపీవో

  • సింగంపల్లి సర్పంచ్‌, కార్యదర్శిపై అధికారుల ఆగ్రహం
  • ‘నమస్తే’ కథనంతో ఆగమేఘాల డంపింగ్‌యార్డ్‌ పూర్తి 
  • మొక్కలను తొలగించిన అటవీశాఖ

మహాముత్తారం,   : ‘దక్కని మొక్కలు.. పునాదుల్లోనే పనులు’ శీర్షికన మంగళవారం ‘నమస్తే’ మినీలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం ఉదయం డీఎల్‌పీవో సుధీర్‌కుమార్‌, ఎంపీవో ఉపేందరయ్యతో కలిసి మహాముత్తారం మండలం సింగంపల్లిలో నిలిచిపోయిన పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శిపై ఆగ్ర హం వ్యక్తంచేశారు. పనులు ఆలస్యంగా చేస్తుండడంపై సంజాయిషీ ఇవ్వాలని ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు వారిద్దరికి సూచించారు. శ్మశానవాటిక పనులు ఇంకా ప్రారంభించకపోవడమేమిటని వారితో పాటు కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తంచేసి వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ఎండిపోయిన మొక్కల స్థానంలో ఈ నెల 17న వెయ్యి మొక్కలు నాటాలని ఎంపీవో చెప్పారు. ఆ తర్వాత మధ్యలోనే నిలిచిపోయిన డంపింగ్‌ యార్డ్‌ పనులను కాంట్రాక్టర్‌ ఆగమేఘాల మీద పూర్తిచేశారు. అలాగే అటవీశాఖ సిబ్బంది ఉదయాన్నే గ్రామానికి చేరుకొని ఎండిపోయిన మొక్కలను ఆ ప్రాంతం నుంచి తొలగించారు.

VIDEOS

logo