శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jayashankar - Feb 09, 2021 , 01:43:49

గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి

గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి

  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

మొగుళ్లపల్లి, ఫిబ్రవరి 8 : గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ యార సుజాతాసంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మిషన్‌ భగీరథ నీటిని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో  మౌలిక సదుపాయాల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుండగా అధికారులు వాటిని అమలు చేయడంతో నిర్లక్ష్యం వహిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ జోరుక సదయ్య, ఎంపీడీవో రామయ్య, సొసైటీ చైర్మన్‌ సంపెల్లి నర్సింగరావు, వైస్‌ ఎంపీపీ పోల్నేని రాజేశ్వర్‌రావు, కో ఆప్షన్‌ మెంబర్‌ రహీం, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

VIDEOS

logo