సోమవారం 08 మార్చి 2021
Jayashankar - Feb 08, 2021 , 01:30:09

సీఎం కేసీఆర్‌ సహకారంతో సింగరేణి కార్మికులకు ప్రయోజనాలు

సీఎం కేసీఆర్‌ సహకారంతో సింగరేణి కార్మికులకు ప్రయోజనాలు

  • టీబీజీకేఎస్‌ భూపాలపల్లి బ్రాంచ్‌ కమిటీ ఉపాధ్యక్షుడు తిరుపతి

భూపాలపల్లి, ఫిబ్రవరి7: సీఎం కేసీఆర్‌ చేయూతతో టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, యూనియన్‌ కేంద్ర కమిటీ నాయకులు సమష్టి కృషితో గతంలో ఎన్నడూలేని విధంగా సింగరేణి కార్మికులకు సంస్థతో ఎన్నో ప్రయోజనాలను సమకూర్చామని సింగరేణి గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) భూపాలపల్లి బ్రాంచ్‌ కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి అన్నారు. ఆదివారం భూపాలపల్లి యూనియన్‌ కార్యాలయంలో ఆ యూనియన్‌ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తిరుపతి మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత  ఎన్నో అవాంతరాలను అధిగమించి కారుణ్య నియామక ఉద్యోగాలను సాధించుకున్నామని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సకల జనుల సమ్మె వేతనం, తెలంగాణ ఇంక్రిమెంట్‌ను టీబీజీకేఎస్‌ యూనియన్‌ ఇప్పించిందన్నారు. ఇరవై ఏళ్ల క్రితం ఆగిపోయిన కొత్త ఉద్యోగాల భర్తీని స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పించిన, ప్రస్తుత నోటిఫికేషన్లు వేయించిన ఘనత సీఎం కేసీఆర్‌కు, టీబీజీకేఎస్‌ యూనియన్‌కు దక్కుతుందన్నారు. సాధించిన పనులను కార్మికవర్గంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. కార్మికులకు రావాల్సిన మిగులు పదోన్నతులు వెంటనే ఇవ్వాలని, కొన్ని విభాగాల ప్రవేటీకరణ యోచనను విరమించుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. గని స్థాయిలో ఫిట్‌ కమిటీలను మరింత బలోపేతం చేస్తామన్నారు. యూనియన్‌ బ్రాంచ్‌ కార్యాలయ నూతన భవనాన్ని నిర్మించనున్నట్లు తిరుపతి వెల్లడించారు. సమావేశంలో బ్రాంచ్‌, ఫిట్‌ కమిటీ నాయకులు బడితల సమ్మయ్య, రాజిరెడ్డి, నల్లబెల్లి సదానందం, కనకయ్య దేవరకొండ మధు, మండ సంపత్‌, సుదర్శన్‌, అన్నాడి మల్లారెడ్డి, కొచ్చర్ల రవికుమార్‌, గాజ సాంబయ్య, భాషనవేన కుమారస్వామి, జీ.రాంచందర్‌ బాబుమియా తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo