బుధవారం 24 ఫిబ్రవరి 2021
Jayashankar - Feb 06, 2021 , 01:24:20

ఏప్రిల్‌ చివరి వరకు సాగుకు జలాలు

ఏప్రిల్‌ చివరి వరకు సాగుకు జలాలు

  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

రేగొండ, జనవరి 5 : నేటి నుంచి ఏప్రిల్‌ చివరి వరకు నిరంతరం సాగుకు జలాలు వస్తాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. యాసంగి సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సారెస్పీ నీటిని ఈనెల 4న విడుదల చేయగా శుక్రవారం నీరు మండలానికి చేరింది. ఎమ్మె ల్యే గండ్ర డీబీఎం 38 కాల్వల ద్వారా వస్తున్న నీటిని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ  గోదావరి జలాలు నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకు వస్తాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నీటితో చెరువులు, కుంటలు నింపనున్నట్లు చెప్పారు. రైతులు కాల్వలకు గండ్లు పెట్టొద్దని సూచించారు. ఉప కాల్వలకు త్వరలోనే మరమ్మతులు చేయనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జీ సురేందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోడెం ఉమేష్‌గౌడ్‌, జడ్పీటీసీ సాయిని విజయాముత్యంరావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు మటిక సంతోష్‌, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రవీందర్‌రావు, సర్పంచులు నడిపెల్లి శ్రీనివాసరావు, పాతపెల్లి సంతోష్‌, ఎంపీటీసీ కేసిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సామాల పాపిరెడ్డి, నాయకులు పున్నం రవి, రాజిరెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo