శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Feb 06, 2021 , 01:24:18

9 నుంచి వాలీబాల్‌ టోర్నమెంట్స్‌

9 నుంచి వాలీబాల్‌ టోర్నమెంట్స్‌

కృష్ణకాలనీ/ ములుగు రూరల్‌, ఫిబ్రవరి 5 : సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈనెల 9, 10 తేదీల్లో తెలంగాణ జాగృతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్‌ క్రీడలు నిర్వహించనున్నట్లు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల అధ్యక్షులు వాంకుడోతు జ్యోతి,  డాక్టర్‌ పోరిక రవీందర్‌ తెలిపారు. శుక్రవారం వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో వారు మాట్లాడారు. జయశంకర్‌ భూపాలపల్లిలోని అంబేద్కర్‌ స్టేడియం, ములుగులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు.  జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్టును హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి కేసీఆర్‌ కప్‌ 2021 టోర్నమెంట్‌కు పంపనున్నట్లు చెప్పారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో వివరాలకు 86390 65243, 98493 39966, 99894 14191, 99516 16325 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ సమావేశాల్లో టీజేఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి, ములుగు మహిళా అధ్యక్షురాలు గంటమూరి భాగ్యలక్ష్మి, హాకీ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జల్ది రమేశ్‌, జాగృతి నాయకులు పైడిపెల్లి రమేశ్‌, తిరుపతి నాయక్‌, ఫణిత్‌రెడ్డి, రాజేంద్ర ప్రసాద్‌, తిక్క మంకయ్య, సతీశ్‌, పెట్టెం మల్లికార్జున్‌, శంకర్‌, అంతటి రాము, నాజర్‌ఖాన్‌, నవీన్‌, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు

VIDEOS

logo