ఆదివారం 07 మార్చి 2021
Jayashankar - Feb 05, 2021 , 00:57:23

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

మొగుళ్లపల్లి, ఫిబ్రవరి 4 : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని పాత ఇస్సిపేటలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ.7.50 లక్షలు, సీసీ రోడ్డుకు రూ.5 లక్షలు, పోతుగల్లు జీపీ భవన నిర్మాణానికి రూ.16 లక్షలు మంజూరు కాగా, గురువారం ఎమ్మెల్యే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడారు. ప్రజల కు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి నెలా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నదన్నారు. ఈ నిధులతో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీలు, సెగ్రిగేషన్‌షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జోరుక సదయ్య, ఎంపీపీ యార సుజాత సంజీవరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, సర్పంచ్‌ కొడారి సునీతారమేశ్‌, బెల్లంకొండ శ్యాంసుందర్‌రెడ్డి, రహీం, గడ్డం రాజు, తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo