బుధవారం 24 ఫిబ్రవరి 2021
Jayashankar - Feb 03, 2021 , 01:40:00

పల్లా గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

పల్లా గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

జడ్పీ చైర్మన్‌ జగదీశ్వర్‌ 

ఏటూరునాగారం/ కన్నాయిగూడెం, ఫిబ్రవరి 2: వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌ బలపర్చిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ములుగు జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ పిలుపు నిచ్చారు. మంగళవారం రొయ్యూరు, శంకరాజుపల్లి, చెల్పాక, అల్లంవారిఘనపూర్‌, ముల్లకట్ట గ్రామాల కార్యకర్తలు, ముఖ్య నాయకులతో రొయ్యూరులో, కన్నాయిగూడెంలో వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో జడ్పీ చైర్మన్‌ మాట్లాడారు. ఈనెల 8న ఏటూరునాగారంలో నిర్వహించే బహిరంగ సభకు పట్టభద్రులు, నాయకులు, కార్యకర్తలను తరలించాలని కోరారు. కన్నాయిగూడెం మండలంలో జడ్పీటీసీ లేని లోటు తీరుస్తానని, మండలాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.  ఈనెలలో 24 నుంచి ఐలాపూర్‌లో నిర్వహించే సమ్మక్క సారలమ్మల జాతరకోసం తాత్కాలిక రోడ్లు, విద్యుత్‌ సదుపాయం తదితరత ఏర్పాట్ల కోసం కలెక్టర్‌, ఐటీడీఏ పీవోతో మాట్లాడుతానని అన్నారు. ఆయా సమావేశాల్లో జడ్పీ కోఆప్షన్‌ సభ్యురాలు వలియాబీ, ఆత్మ చైర్మన్‌ రమణయ్య, మేడారం ట్రస్టుబోర్డు చైర్మన్‌ ఆలం రామ్మూర్తి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కూనూరు అశోక్‌, పార్టీ మండల అధ్యక్షుడు గడదాసు సునీల్‌కుమార్‌, మండల అధికారి ప్రతినిధి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు సుబ్బుల సమ్మయ్య, నాయకులు పాల్గొన్నారు.

మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలి

ములుగురూరల్‌, ఫిబ్రవరి2:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు పోరిక గోవింద్‌నాయక్‌ అన్నారు. మహ్మద్‌గౌస్‌పల్లి, మల్లంపల్లి, రామచంద్రాపురం, భూపాల్‌నగర్‌, అబ్బాపురం, జాకారం పాఠశాలల్లో  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, జడ్పీటీసీ భవాని, వైస్‌ ఎంపీపీ విజయలక్ష్మి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 


VIDEOS

logo