సమగ్రాభివృద్ధే సర్కార్ ధ్యేయం: ఎమ్మెల్యే

చిట్యాల, ఫిబ్రవరి1: సమగ్రాభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పని చేస్తున్నదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం చల్లగరిగెలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేసి, చల్లగరిగె, జూకల్ గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. చల్లగరిగె సర్పంచ్ కర్రె మంజూల అశోక్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం మండల కేంద్రంలో 75 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులకు, స్థానిక పోలీస్టేషన్ ఆవరణలో అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాప చేశారు. మండల కేంద్ర శివారులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 8 మందికి రూ.5.3లక్షల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఎంపీపీ వినోదావీరారెడ్డి, జడ్పీటీసీ సాగర్, వైస్ ఎంపీపీ రాంబాబు, పీఏసీఎస్ చైర్మన్ క్రాంతికుమార్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, డీఈ విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
గ్రంథాలయం ప్రారంభం
టేకుమట్ల, ఫిబ్రవరి1: వెలిశాలలోని ప్రభుత్వ పాఠశాలలో గాదర్ల పోచయ్య తన తల్లిదండ్రులైన గాదర్ల లింగయ్య, లక్ష్మి పేరున నిర్మించిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రామకృష్ణపూర్(వీ) లో నిర్మించిన సీసీ రోడ్లను, సైడ్ కాల్వలను ఆయన ప్రారంభించి, అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కర పత్రాన్ని ఆవిష్కరించారు. వెంకట్రావ్పల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్మించే సైన్స్ ల్యాబ్‌కు శంకుస్థాపన చేశారు. ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంపత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- భారతీయులపై నేపాల్ పోలీసులు కాల్పులు.. ఒకరు మృతి
- శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన ఇద్దరికి యూకే స్ట్రెయిన్
- తాత అదుర్స్.. వందేళ్ల వయసులోనూ పని మీదే ధ్యాస
- బెంగాల్ పోరు : కస్టమర్లను ఊరిస్తున్న ఎన్నికల స్వీట్లు
- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం..కడవరకు పోరాడుతాం
- ఏపీలో కొత్తగా 124 కరోనా కేసులు
- సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో సవరణలు
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్‌ఫ్రెండ్ రిక్వెస్ట్