శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Feb 02, 2021 , 00:24:17

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

మహదేవపూర్‌, ఫిబ్రవరి 1: మహదేవపూర్‌, ఎలికేశ్వరం, అన్నారం గ్రామాలకు చెందిన లక్ష్మి, షేక్‌ గౌజ్‌, సంతోష్‌, కేశవరావు, చంద్రమౌళికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మండలకేంద్రంలో సోమవారం ఎంపీపీ రాణిబాయి అందజేశారు. రూ.2లక్షల15వేల విలువచేసే చెక్కులను జయశంకర్‌ భూపాల్‌పల్లి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌లు జక్కు శ్రీహర్షిణి, పుట్ట మధు ఆదేశాలతో పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో  టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్‌రావు, సర్పంచ్‌ శ్రీపతిబాపు, పీఏసీఎస్‌ వైస్‌ ఛైర్మన్‌ పెండ్యాల అనిల్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల మహిళా అధ్యక్షురాలు అరుణ, కార్యకర్తలు కేదారి గీత, అన్కారి ప్రకాశ్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo