ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jayashankar - Feb 01, 2021 , 00:17:34

ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలి

ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలి

  • గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి కన్నె బోయిన రాజయ్య యాదవ్‌, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

జయశంకర్‌ భూపాలపల్లి, జనవరి 31(నమస్తేతెలంగాణ): రాబోయే నల్లొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌  తరఫున పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృష్టి చేయాలని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి  కన్నెబోయిన రాజయ్య యాదవ్‌, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత అభివృద్ధిలో రాష్ట్రం ముందంజలో ఉందని, అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని వారు అన్నారు. మల్టీనేషనల్‌ కంపెనీల ఏర్పాటుతో రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో లభిస్తున్నాయని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట తీరు మార్చుకోవాలని అన్నారు. హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు. పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి విద్యావంతుడు, సుపరిచితుడైన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అత్యదిక మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధం కావాలని వారు పిలుపు నిచ్చారు. సమావేశంలోజడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ కల్లెపు శోభ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటరాణి, వైస్‌చైర్మన్‌ హరిబాబు, ఎంపీపీ మందల లావణ్య, పీఏసీఎస్‌ చైర్మన్లు మేకల సంపత్‌యాదవ్‌, పూర్ణచందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సాంబమూర్తి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలి

రేగొండ, జనవరి 31: కార్యకర్తలు అంకితభవం, క్రమశిక్షణతో పని చేసినప్పుడే ఉన్నత స్థాయి నాయకుడిగా ఎదుగగలరని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమాణారెడ్డి అన్నారు. కొడవటంచ గ్రామంలో ఆదివారం టీఆర్‌ఎస్‌ మొగుళ్లుపల్లి మండల కార్యకర్తల ఆత్మయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కార్యకర్తలే పార్టీకి పునాదులు అన్నారు. కార్యక్రమంలో మొగుళపల్లి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినధులు పాల్గొన్నారు.


VIDEOS

logo