శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Jan 31, 2021 , 00:31:45

మరుగుదొడ్ల నిర్మాణంపై విచారణ చేపట్టాలి

మరుగుదొడ్ల నిర్మాణంపై విచారణ చేపట్టాలి

  • మున్సిపల్‌ సమావేశంలో సభ్యుల డిమాండ్‌ 

భూపాలపల్లి టౌన్‌, జనవరి 30: భూపాలపల్లి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ఒక కాంట్రాక్టర్‌ నిర్మించిన పబ్లిక్‌ టాయిలెట్స్‌పై విచారణ చేపట్టాలని మున్సిపల్‌ కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. భూపాలపల్లిలోని ఇల్లందు అతిథిగృహంలో శనివారం మున్సిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం చైర్‌ పర్సన్‌ సెగ్గం వెంకటరాణి సిద్ధు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్‌ కృష్ణఆదిత్య  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో పట్టణంలోని ఎస్సీ కాలనీల అభివృద్ధికి మంజూరైన రూ.3 కోట్ల పనుల ప్రారంభానికి, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.కోటితో సుభాష్‌కాలనీలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. అనంతరం చైర్‌పర్సన్‌ అనుమతితో ఇతర అంశాలపై చర్చించారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ అశోక్‌ కుమార్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గండ్ర హరీశ్‌రెడ్డి,  కమిషనర్‌ శ్రీనివాస్‌, డీఎంహెచ్‌వో సుధార్‌సింగ్‌, భూపాలపల్లి ఆర్టీసీ డీఎం లక్ష్మిధర్మ, జిల్లా హార్టికల్చర్‌ అధికారి అక్బర్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo