శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Jan 31, 2021 , 00:31:45

ముగిసిన శిబిరం

ముగిసిన శిబిరం

కృష్ణకాలనీ,జనవరి30: ఉపకరణాలు అవసరమున్న దివ్యాంగులను ఎంపిక చేసే శిబిరం శనివారం ముగిసింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో ఈ శిబిరం రెండు రోజులుగా కొనసాగుతోంది. శిబిరానికి వచ్చిన విద్యాంగులకు జిల్లా మహిళా, వయోవృద్ధుల, బాలల సంరక్షణ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. బ్యాటరీ సైకిల్‌ కోసం 101 మంది, కృత్రిమ కాళ్లు, చేతుల కోసం 26, క్వాలిఫీర్స్‌కు 9, ఇతర పరికరాల కోసం 73 మంది దివ్యాంగులు శిబిరానికి హాజరయ్యారని జిల్లా సంక్షేమాధికారి శ్రీదేవి తెలిపారు. కార్యక్రమంలో సీడీపీవోలు అవంతి, రాధిక, బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ, వెంకటస్వామి, రాజకొంరయ్య, అంగన్‌వాడీ టీచర్లు, సఖీ కేంద్రం సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


VIDEOS

logo