మంగళవారం 09 మార్చి 2021
Jayashankar - Jan 31, 2021 , 00:31:47

నూనె గింజల పంటలు సాగు చేయాలి

నూనె గింజల పంటలు సాగు చేయాలి

చిట్యాల, జనవరి30: రైతులు నూనెగింజల పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి విజయభాస్కర్‌ అన్నారు. శనివారం చల్లగరిగె గ్రామంలో ఏవో నాలికె రఘుపతి ఆధ్వర్యంలో ఎంపీపీ దావు వినోదావీరారెడ్డి అధ్యక్షతన నూనె గింజల సాగుపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డీఏవో, డీఏఏటీసీ శాస్త్రవేత్త నర్సయ్య అతిథిలుగా హాజరై అవగాహన కల్పించారు. నూనె గింజల సాగు లాభసాటిగా మారనున్నదని అన్నారు. రైతులు నూనె గింజల సాగును పెంచుకోవాలని సూచించారు. రైతులందరూ డ్రమ్‌సీడర్‌ పద్ధతిలో వరి సాగు చేసుకోవాలన్నారు. నీటి వసతి కలిగి ఉన్న రైతులు నువ్వులు, పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటలు సాగు చేయాలన్నారు. అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి వేరుశనగ పంటలను పరిశీలించారు. ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు. 

VIDEOS

logo