శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Jan 31, 2021 , 00:31:47

తప్పుడు ప్రచారం మానుకోవాలి

తప్పుడు ప్రచారం మానుకోవాలి

మంగపేట జనవరి30: పీఆర్‌సీపై బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన శనివారం మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విషయంతో సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధి కలిగి ఉన్నారని, పీఆర్‌సీపై అవగాహన లేని వారు స్థాయికి మించిన వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్నారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్‌, మండల అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ, మండల మహిళా అధ్యక్షురాలు కాటూరి సుగుణ, మైనార్టీ అధ్యక్షుడు అయూబ్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo