మంగళవారం 02 మార్చి 2021
Jayashankar - Jan 30, 2021 , 01:02:07

ఆత్మగౌరవ యాత్ర కరపత్రాల ఆవిష్కరణ

ఆత్మగౌరవ యాత్ర కరపత్రాల ఆవిష్కరణ

భూపాలపల్లి టౌన్‌, జనవరి 29: కల్లు గీత కార్మికుల ఆత్మగౌరవ యాత్ర కరపత్రాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి భూపాలపల్లిలో శుక్రవారం వేర్వేరు కార్యక్రమాల్లో ఆవిష్కరించారు. సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నం భిక్షపతిగౌడ్‌ మాట్లాడుతూ వచ్చేనెల 10న టేకుమట్లలో ఈయాత్ర ప్రారంభమై 11న జిల్లా కేంద్రానికి చేరుకుంటుందని, నాయకులు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తారని అన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్‌ కౌన్సిలర్‌ మంజాల రవీందర్‌, మొగుళ్లపల్లి, రేగొండ, మల్హర్‌ గౌడ సంఘం అధ్యక్షులు కత్తి రాజు, రాజు, దుర్గరాజు, రేగొండ మాజీ ఎంపీపీ మండల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo