శనివారం 27 ఫిబ్రవరి 2021
Jayashankar - Jan 30, 2021 , 01:02:04

శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించొద్దు

శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించొద్దు

కాటారం, జనవరి 29: ఎవరైనా శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే పోలీసులు ఉపేక్షించొద్దని భూపాలపల్లి ఇన్‌చార్జి ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌ సూచించారు. శుక్రవారం కాటారం హైటెక్‌ పోలీస్‌ స్టేషన్‌తోపాటు డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పలు సలహాలు, సూచనలు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాలకు వచ్చే అపరిచిత వ్యక్తుల వివరాలను సేకరించాలని అన్నారు. నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు న్యాయం కోసం వచ్చే వారిలో ధైర్యం నింపేందుకు వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులను సత్వరమే విచారణ బాధితులకు న్యాయం చేయాలని, పెండింగ్‌ కేసులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఆయన వెంట అదనపు ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ బోనాల కిషన్‌, సీఐలు హథీరాం, నర్సయ్య, ఎస్సై సాంబమూర్తి ఉన్నారు.


VIDEOS

logo