బుధవారం 03 మార్చి 2021
Jayashankar - Jan 28, 2021 , 00:41:23

‘కారుణ్య నియామకాలు తిరిగి తీసుకొచ్చింది టీబీజీకేఎస్సే’..

‘కారుణ్య నియామకాలు తిరిగి తీసుకొచ్చింది టీబీజీకేఎస్సే’..

భూపాలపల్లి, జనవరి 27 : సీఎం కేసీఆర్‌ ప్రభు త్వ సహకారంతో సింగరేణిలో కారుణ్య నియామకాలు తిరిగి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌)దేనని ఆ సంఘం భూపాలపల్లి బ్రాంచి కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు బడితల స మ్మయ్య అన్నారు. బుధవారం సంఘం కార్యాలయంలో యూనియన్‌ 18వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో సమ్మయ్య  టీబీజీకేఎస్‌ జెం డాను ఆవిష్కరించి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన యూనియన్‌ శ్రేణులు, కార్మికులనుద్దేశించి మా ట్లాడారు. జాతీయ కార్మిక సంఘాలు పొడగొట్టిన అనేక హక్కులను తిరిగి సాధించిన ఘ నత టీబీజీకేఎస్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవరకొండ మధు, కొచ్చర్ల రవికుమార్‌, గాజ సాంబయ్య, కుమారస్వామి, రాంచందర్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo