మంగళవారం 02 మార్చి 2021
Jayashankar - Jan 28, 2021 , 00:41:23

టీఆర్‌ఎస్‌తోనే మున్సిపాలిటీ అభివృద్ధి

టీఆర్‌ఎస్‌తోనే మున్సిపాలిటీ అభివృద్ధి

  •  మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గండ్ర హరీశ్‌రెడ్డి

కృష్ణకాలనీ, జనవరి 27 : టీఆర్‌ఎస్‌తోనే భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గండ్ర హరీశ్‌రెడ్డి అన్నా రు. బుధవారం 27వ వార్డు జవహర్‌నగర్‌ కాలనీలో డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ.4లక్షలతో డ్రైనేజీ పనులను హరీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చి న హామీలన్నీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సహకారంతో త్వరగా పూర్తి చేస్తానని తెలిపారు. వార్డులో రోడ్లు దెబ్బతింటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. సత్తార్‌నగర్‌, రెవెన్యూకాలనీ, ఐటెక్‌ కా లనీ, జవహర్‌ నగర్‌ కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. కౌన్సిలర్‌గా ఎన్నికై ఏడాది కాలం పూర్తి చేసుకున్న హరీశ్‌రెడ్డిని ప్రజలు శా లువాతో సన్మానించి, కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు కంకటి రాజవీరు, పైడిపల్లి రమేశ్‌, పెరుమాండ్ల తిరుపతి, వాసాల బాబు, పైండ్ల తిరుపతి, కప్పల రాజేశ్‌, విజయ్‌, వాసాల స్వప్న పాల్గొన్నారు.


VIDEOS

logo