మువ్వన్నెల రెపరెపలు

- జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గణతంత్ర వేడుకలు
- ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఎగిరిన జాతీయ పతాకం
- హాజరైన అధికారులు, ప్రజా ప్రతినిధులు
నమస్తే బృందం : గణతంత్ర దినోత్సవ వేడుకలు జయశం కర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవే ట్, వివిధ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ని ర్వహించారు. ములుగు కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీదేవి, జడ్పీటీసీ సకినాల భవానితో కలిసి జడ్పీ చైర్మన్ జగదీశ్వర్ జా తీయ జెండాను ఎగురవేశారు. ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సీతక్క, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్కార్యాలయంలో సీఈ విజయ్‌భాస్కర్‌రావు, డీఎఫ్‌వో కా ర్యాలయంలో ప్రదీప్‌కుమార్‌శెట్టి, ప్రభుత్వ దవాఖానలో సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్, డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎస్ఆర్వో తస్లీమ్మహ్మద్, డీఏవో కార్యాలయంలో కేఏ గౌస్‌హైదర్, డీడబ్ల్యూవో కార్యాలయంలో ఈపీ ప్రేమలత, ఏఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ సాయిచైత న్య, జిల్లా పశువైద్యశాఖ కార్యాలయంలో డాక్టర్ విజయ్‌భాస్కర్, డీఈవో కార్యాలయంలో వాసంతి, త్రివర్ణ పతాకాల ను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆర్డీవో కార్యాలయంలో డీఆర్వో కే రమాదేవి, డీసీవో కార్యాలయంలో విజయభాస్కర్, ములుగు సంక్షేమ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో పీవో హన్మంతు కే జండగే, ఏఎస్పీ కార్యాలయం వద్ద ఏఎస్పీ గౌసం ఆలం, అటవీశాఖ డివిజన్ కార్యాలయంలో ఎఫ్‌డీవో వీణావాణి, జీసీసీ కార్యాలయం వద్ద డివిజనల్ మేనేజర్ ప్రతాప్‌రెడ్డి, సామాజిక వైద్యశాలలో సూపరింటెండెంట్ సురేశ్‌కుమార్, జాతీయ పతాకావిష్కరణ చేశారు. భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం కార్యాలయంలో జీఎం ఈసీహెచ్ నిరీక్షణ్‌రాజ్, కేటీపీపీలో జెన్కో సీఈ సిద్ధయ్య, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, కలెక్టర్ కార్యాలయంలో జేసీ కూరాకుల స్వర్ణలత, ప్రగతి భవన్లో జిల్లా ఇన్చార్జి గ్రామీణ అభివృద్ధి అధికారి శైలజ, మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీసిద్ధు, అడిషనల్ ఎస్పీ వీ శ్రీనివాసులు, ఆర్డీవో కే శ్రీనివాస్, డీఎస్పీ ఏ సంపత్‌రావు, ఎఫ్‌డీవో వజ్రారెడ్డి, డీవైసీఎంవో డాక్టర్ పద్మజ, టీఆర్ఎస్ కార్యాలయంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభా రఘుపతిరావు, ఆర్టీసీ డిపోలో డీఎం లక్ష్మీధర్మ, డీఈవో కార్యాలయంలో డీఈవో మహ్మద్ అబ్దుల్ హై మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.
తాజావార్తలు
- ప్రతి ప్రాథమిక పాఠశాలకు హెచ్.ఎం పోస్టుకు కృషి
- మహారాష్ట్రలో 22 లక్షలు దాటిన కరోనా కేసులు
- మీ ఫేస్బుక్ ఖాతా సురక్షితమేనా?
- ఆన్లైన్లో హైకోర్టు సెషన్.. లైవ్‌లో న్యాయవాది భోజనం
- కోరిన రెండు గంటల్లో దివ్యాంగురాలికి బ్యాటరీ ట్రై సైకిల్ అందజేత
- సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఇతగాడే
- బంగారంపై మోజు పెరుగుతుంటే ధరలు తగ్గుతున్నాయ్.. ఎందుకంటే?!
- వేములవాడలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా
- పవన్‌తో నాకు ముడి పెడితే తాట తీస్తా: అశు రెడ్డి
- 9 నుంచి శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేక బస్సులు