బుధవారం 03 మార్చి 2021
Jayashankar - Jan 27, 2021 , 01:46:50

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

మహదేవపూర్‌, జనవరి 26 : మండలంలోని అన్నారం అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై మంగళవారం కాళేశ్వరం పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సై నరహరి కథనం ప్రకారం.. మహాముత్తారం, మహదేవపూర్‌, కాళేశ్వరం, చెన్నూర్‌ గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో దాడులు చేసినట్లు చెప్పారు. ఏడుగురు నిందితులను పట్టుకోగా మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు ఎస్సై పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో రూ.94,710వేల నగదు, ఐదు  ద్విచక్ర వాహనాలు, కారుతో పాటు ఏడు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్న ట్లు తెలిపారు. 13 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

జాతీయ రహదారిపై తనిఖీలు

వాజేడు : మండలంలోని చండ్రుపట్ల శివారులో మంగళవారం ఎస్సై హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. 

VIDEOS

logo