శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Jan 26, 2021 , 01:01:24

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

మహాముత్తారం, జనవరి25: వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి వేణు అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా రవాణాశాఖ కార్యాలయం ఆవరణలో వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డీటీవో మాట్లాడుతూ వాహనాలు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ఖచ్చితంగా ధరించాలని, అర్హత పత్రాలు కలిగిం ఉండాలని, మద్యం తాగి నడపరాదని, అతి వేగంగా డ్రైవింగ్‌ చేయకుండా ఉంటే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. కార్యక్రమంలో సిబ్బంది సందాని, శ్రీనివాస్‌, నరేందర్‌, రామకృష్ణ, శ్రీహరి, వేణు, కమలాకర్‌ పాల్గొన్నారు. వెంకటాపురం (నూగూరు)లో భూపాలపల్లి ఆర్టీవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో డ్రైవర్లు, వాహనదారులకు అవగాహన కల్పించారు. మహాముత్తారం మండలం యామన్‌పల్లి గ్రామంలో కాటారం సీఐ హథిరాం, ఎస్సై శ్రీనివాస్‌ ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు.


VIDEOS

logo