సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Jan 26, 2021 , 01:01:22

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి: కలెక్టర్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి: కలెక్టర్‌

భూపాలపల్లి రూరల్‌, జనవరి 25: రూర్బన్‌ మిషన్‌ కార్యక్రమం ద్వారా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ అధ్యక్షతన భూపాలపల్లి మండలంలోని నాగారం క్లస్టర్‌లో శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్‌ కార్యక్రమం పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి వసతులు కల్పించేందుకు నాగారం క్లస్టర్‌లో 18 గ్రామాలు ఎంపికై నిధులు మంజూరై వివిధ పనులు జరుగుతున్నాయని అన్నారు. మిషన్‌ భగీరథ తాగునీటి కల్పన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, గత వారం సిద్ధిపేట జిల్లా కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు చేతుల మీదుగా అవార్డులు పొందిన ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ నిర్మల, సిబ్బందిని అభినందించారు. అనంతరం జిల్లాలో గుర్తింపు పొందిన ప్రైవేట్‌ వైద్యులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించి కరోనా వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. సమావేశంలో డీఆర్డీవో శైలజ, రూర్బన్‌ మిషన్‌ జిల్లా ప్రాజెక్ట్‌ అధికారి సింధూర, డీఎంహెచ్‌వో సుధార్‌ సింగ్‌, డీపీవో లత, డీఈవో మహ్మద్‌ అబ్దుల్‌ హై, డిప్యూటీ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌  సాంబయ్య పాల్గొన్నారు.


VIDEOS

logo