మంగళవారం 02 మార్చి 2021
Jayashankar - Jan 25, 2021 , 01:02:58

లింగ వివక్షను రూపు మాపాలి

లింగ వివక్షను రూపు మాపాలి

  • బాలరక్ష భవన్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ శిరీష

కృష్ణకాలనీ, జనవరి 24: నాగరికత అభివృద్ధి చెందుతున్నప్పుటికీ బాలికలపై వివక్ష తగ్గడం లేదని, లింగవివక్షను రూపు మాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాలరక్షభవన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ శిరీష అన్నారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చైల్డ్‌లైన్‌1098 ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఆమె మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. జిల్లాలో బాలికల సంఖ్య గణనీయంగా పేరిగిందన్నారు. వేయి మంది బాలురకు 1003 మంది బాలికలు ఉన్నారన్నారు. బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్‌లైన్‌ 1098 కృషి చేస్తున్నాయని  అన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన బాలికలను సన్మానించారు. కార్యక్రమంలో సీడీపీవో అవంతి, జిల్లా బాలల సంరక్షణాధికారి హరికృష్ణ, చైల్డ్‌లైన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ సుమన్‌, బాలాల సంరక్షణ అధికారులు రాజా కొంరయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo