సోమవారం 08 మార్చి 2021
Jayashankar - Jan 25, 2021 , 01:03:00

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

భూపాలపల్లి టౌన్‌, జనవరి24: అన్ని రంగాల్లో పనిచేస్తున్న డ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, పరిమిత వేగంతో వాహనాలు నడుపాలని భూపాలపల్లి ఎస్సై అభినవ్‌ అన్నారు. ఆదివారం భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్‌ లక్ష్మీధర్మ అధ్యక్షతన డ్రైవర్స్‌డే నిర్వహించారు. డిపోలో అత్యధికంగా కేఎంపీఎల్‌ తీసుకువచ్చిన డ్రైవర్లు వెంకటేశ్వర్లు, గౌసొద్దీన్‌, ప్రమాదరహితంగా బస్సులు నడిపిన డ్రైవర్లు కొమురయ్య, సాంబయ్యను ఉత్తమ డ్రైవర్లుగా ఎంపిక చేసి సన్మానించారు. ఆటో డ్రైవర్లను, లారీ డ్రైవర్లను సన్మానించి వారికి పుష్పం అందజేసి అభినందించారు. డిపో మేనేజర్‌ మాట్లాడుతూ డ్రైవర్లను అభినందించడానికి, డ్రైవర్లకు ఒక రోజు ఉండాలనే ఉద్దేశంతో 2018లో అప్పటి ఆర్‌ఎం సూర్యకిరణ్‌ వరంగల్‌ రీజియన్‌లో డ్రైవర్స్‌డే ను ప్రారంభించారని, ఇప్పుడు డ్రైవర్స్‌ డే తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోందని అన్నారు. అనంతరం ఆర్టీసీ, ఆటో, లారీ డ్రైవర్లు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డిపో ఎస్‌టీఐ రామయ్య, ఎంఎఫ్‌ ప్రసన్నలక్ష్మి, డ్రైవర్లు పాల్గొన్నారు. 

VIDEOS

logo