గురువారం 04 మార్చి 2021
Jayashankar - Jan 25, 2021 , 01:03:00

పుస్తె, మెట్టెలు అందజేత

పుస్తె, మెట్టెలు అందజేత

మహాముత్తారం, జనవరి24: నిరుపేద వివాహానికి పుట్ట లింగమ్మా చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పంపిణీ చేసిన  పుస్తె, మెట్టెలను టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మార్క రాముగౌడ్‌ ఆదివారం అందజేశారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ధరమ్‌సోత్‌ సురేశ్‌, నూనావత్‌ శ్రీలతకు పెద్దల సమక్ష్యంలో వివాహం కుదిరింది. పెళ్లికి సహకరించాలని బంధువులు పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకు విన్నవించగా పుట్ట లింగమ్మా చారిటబుల్‌ ట్రస్టు తరఫున పుస్తెమెట్టెలను సమకూర్చారు. ఆదివారం నర్సింగాపూర్‌ హనుమాన్‌ ఆలయంలో వధూవరుల వివాహం కావడంతో టీఆర్‌ఎస్‌ నాయకులు వెళ్లి వాటికి అందజేశారు. కార్యక్రమంలో రెడ్డిపల్లి సర్పంచ్‌ అజ్మీరా విమలపూల్‌సింగ్‌, రేగులగూడెం సర్పంచ్‌ భూషి దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల యూత్‌ అధ్యక్షుడు అజ్మీరా ధరమ్‌సింగ్‌, లింగయ్య, కొండాల్‌రెడ్డి పాల్గొన్నారు. 


VIDEOS

logo