శనివారం 27 ఫిబ్రవరి 2021
Jayashankar - Jan 22, 2021 , 00:15:28

రేషన్‌ అక్రమ నిల్వ చట్టవిరుద్ధం : జేసీ

రేషన్‌ అక్రమ నిల్వ చట్టవిరుద్ధం : జేసీ

భూపాలపల్లి రూరల్‌, జనవరి 21 : రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడం చట్ట విరుద్ధమని అందుకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని జేసీ కూరాకుల స్వర్ణలత అన్నారు. గురువారం సాయంత్రం తన చాంబర్‌లో 6ఏ కేసుల్లో పట్టుబడిన 1,088.69 క్వింటాళ్ల బియ్యానికి జేసీ అధ్యక్షతన బహిరంగ వేలం నిర్వహించారు. కిలో బియ్యం అత్యల్పంగా రూ.20.70 పైసలు, అత్యధికంగా రూ.22.30 పైసల చొప్పున వేలంలో పాల్గొన్న వారు కొనుగోలు చేశారు. తద్వారా రూ.23,69,142 ప్రభుత్వ ఖజానాలో జమయ్యాయి. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీశంకర్‌, నాయబ్‌ తహసీల్దార్లు ఎండీ ముస్తాఫా బిన్‌ హుస్సేన్‌, ఎండీ ముక్తార్‌పాషా, సిబ్బంది బీ విజయ్‌ కుమార్‌, జీ శ్రీనివాస్‌, జీ రాజు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo