సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Jan 22, 2021 , 00:15:32

సింగరేణి ఏరియా దవాఖానలో వ్యాక్సినేషన్‌ ప్రారంభం

సింగరేణి ఏరియా దవాఖానలో వ్యాక్సినేషన్‌ ప్రారంభం

భూపాలపల్లి జనవరి 21 :  భూపాలపల్లి సింగరేణి ఏరియా దవాఖానలో  గరువారం వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించారు.దవాఖానలో డాక్టర్లు, వైద్య సిబ్బంది మొత్తం 210 మంది ఉన్నారు. ఇందులో మొదటి రోజు వంద మంది డాక్టర్లు, వైద్యసిబ్బంది పేర్లు నమోదు చేసుకోగా 48 మంది మాత్రమే వచ్చి టీకా వేసుకున్నారు. దవాఖానలో పనిచేస్తున్న ల్యాబ్‌టెక్నీషియన్‌ డీ విద్యాసాగర్‌కు మొదటగా కరోనా వ్యాక్సిన్‌ వేశారు. శుక్రవారం మిగతా వారందరికీ వ్యాక్సిన్‌ వేయనున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో  వ్యాక్సినేషన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ ఉమాదేవి, సింగరేణి దవాఖాన డీవైసీఎంవో డాక్టర్‌ పద్మజ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo