కష్టకాలంలోనూ లబ్ధిదారులకు సర్కారు అండ

- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి టౌన్, జనవరి 20: కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారినా ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ లబ్ధిదారులకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండలంలోని కల్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. 54 మందికి కల్యాణలక్ష్మి, 21 మందికి సీఎం సహాయనిధి చెక్కు(రూ.6.52 లక్షలు)లతోపాటు రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ నాయకుడు ఈసంపల్లి సమ్మయ్య మృతి చెందగా బాధిత కుటుంబానికి పార్టీ సభ్యత్వాకి సంబంధించిన రూ.2 లక్షల బీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ కళ్లెపు శోభ రఘుపతిరావు, ఎంపీపీ లావణ్య సాగర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణి సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, నాయకులు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 1లోగా సర్వే పూర్తి చేయండి
భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓసీ 2 ప్రాజెక్టుకు సంబంధించిన భూముల సర్వేను ఫిబ్రవరి 1లోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సింగరేణి అధికారులను కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏరియా సింగరేణి జీఎం నిరీక్షణ్‌రాజ్, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్వోటూజీఎం విజయప్రసాద్, డీవైపీఎం అనిల్‌కుమార్, ఎస్టేట్ ఆఫీసర్ శివ, భూనిర్వాసితులు పాల్గొన్నారు.
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
మల్హర్, జనవరి 20: మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం 43 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎంపీపీ మల్హల్ రావు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- రైతుల నిరసన : ‘ఈసారి బారికేడ్లు పెడితే బద్దలుకొడతాం’
- పవన్-రానా సినిమా ఫొటో లీక్.. షాక్‌లో నిర్మాతలు
- ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి
- త్వరలో టీటీడీ నుంచి గో ఉత్పత్తులు : ఈఓ
- సుశాంత్ కేసులో 12వేల పేజీల చార్జిషీట్ సమర్పించిన ఎన్సీబీ
- శర్వానంద్‌కు టాలీవుడ్ స్టార్స్ సాయం...!
- గోల్డ్ స్మగ్లింగ్ కేసు : సంచలన విషయాలు వెల్లడించిన స్వప్నా సురేష్!
- ఐసీఐసీఐ హోమ్‌లోన్‌పై తగ్గిన వడ్డీరేటు.. పదేళ్లలో ఇదే తక్కువ
- ద్వారకాలో కార్తికేయ 2 చిత్రీకరణ..!
- బీజేపీ పాలనలో మిగిలింది కోతలు.. వాతలే