ఆదివారం 07 మార్చి 2021
Jayashankar - Jan 21, 2021 , 02:25:40

భూపాలపల్లిలో అనుమానాస్పద మృతి

భూపాలపల్లిలో అనుమానాస్పద మృతి

  • భార్యే చంపినట్లు ఆరోపణలు

భూపాలపల్లి టౌన్‌, జనవరి 20: భూపాలపల్లి మండలంలోని నేరేడుపల్లిలో బుధవారం సాయంత్రం అనుమానాస్పదం గా ఒకరు మృతిచెందారు. కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన భర్తను అతడి భార్యే చంపినట్లు మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్‌ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లికి చెందిన కాళేశ్వరపు రమేశ్‌కు భూపాలపల్లి మండలం నేరేడుపల్లికి చెందిన తుపాకుల శారదకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. డిసెంబర్‌ 1న ఒక శుభకార్యం కోసం రమేశ్‌ అత్తగారింటికి వెళ్లాడు. డిసెంబర్‌ 5న నుంచి కనిపించకుండా పోవడంతో తన వదినపైనే అనుమానం ఉందని అతడి సోదరి శ్రీలత భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరుపుతుండగా బుధవారం సాయంత్రం గ్రామ శివారులో రమేశ్‌ను పూడ్చిపెట్టారనే సమాచారం వచ్చింది. సాయంత్రం కావడంతో సీఐ వాసుదేవరావు, ఎస్‌ఐ అభినవ్‌ వెనుదిరిగారు. పూడ్చిపెట్టినట్లు భావిస్తున్న స్థలంలో గురువారం తవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు.

VIDEOS

logo