ఉచిత శిక్షణ.. ఆర్మీ ఉద్యోగ ఎంపికకు నిచ్చెన

భూపాలపల్లి, జనవరి 19 : సింగరేణి సంస్థ ఇచ్చే ఉచిత శిక్షణ, ఆర్మీ ఉద్యోగాల ఎంపికకు నిచ్చెన వంటిదని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం నిరీక్షణ్‌రాజ్ అన్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ స్క్రీనింగ్ టెస్ట్‌లో ఎంపికైన వారికి సింగరేణి యాజమాన్యం 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తుందన్నారు. ఉచిత శిక్షణ కోసం 167 మంది దరఖా స్తు చేసుకోగా, స్క్రీనింగ్ టెస్ట్‌కు 149 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. 85 మంది అభ్యర్థులు అర్హత సాధించారని, ఇందులో అత్యంత ప్రతిభ కనబర్చిన 50 మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జీఎం తెలిపారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం విజయప్రసాద్, ఏజెంట్ బీవీ రమణ, వెంకటాపూర్ బ్లాక్ పీవో రఘుపతి, పర్సనల్, సివిల్ డీజీఎంలు మంచాల శ్రీనివాస్, సత్యనారాయణ, గుర్తింపు సంఘం నేత కొక్కుల తిరుపతి, సీనియర్ పీవో రాజేశం, కమ్యూనికేషన్ సెల్ కో ఆర్డినేటర్, ఉత్తమ్‌కుమార్ మల్లిక్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- నెట్‌ఫ్లిక్స్ డీల్ కు నో..కారణం చెప్పిన నాగార్జున
- గల్వాన్‌లో మనపై దాడిచేసిన చైనా కమాండర్‌కు అత్యున్నత పదవి
- మోదీ స్టేడియంలో కోహ్లీసేన ప్రాక్టీస్: వీడియో
- ఆ టీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు తెలుసా..!
- జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
- విద్యార్థులను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి
- ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్‌లోకి ఎస్బీఐ?.. అందుకే..!
- ‘బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడటమే మా ప్రాధాన్యత’
- న్యాయవాద దంపతుల హత్యకు వాడిన కత్తులు లభ్యం
- తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తాం : అసదుద్దీన్ ఒవైసీ