శనివారం 06 మార్చి 2021
Jayashankar - Jan 19, 2021 , 01:13:31

దొంగ పట్టాలు రద్దు చేయాలని రైతుల ఆందోళన

దొంగ పట్టాలు రద్దు చేయాలని రైతుల ఆందోళన

మహాముత్తారం, ఫిబ్రవరి18: దొంగ పట్టాలను రద్దు చేసి, అసలైన రైతులకు పట్టాలు ఇవ్వాలని ప్రేమ్‌ నగర్‌, పెగడపల్లి గ్రామాల  రైతులు సోమవారం ధర్నా చేశా రు. పాదయాత్రగా మహాముత్తారం తహసీల్‌ ఆఫీస్‌కు తరలివచ్చి బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రేమ్‌నగర్‌ గ్రామంలోని సర్వే నంబర్‌ 108లో దాదాపు 1509 ఎకరాల భూమి ఉందన్నారు. ఇందులో వందలాది ఎకరాలు గతంలో రెవెన్యూ అధికారులు దొంగపట్టాలు చేశారని పేర్కొన్నారు. వీటిని రద్దు చేయకుండా అర్హులైన రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కొత్త పట్టాలను తొలగించడం ఎంత వరకు సమంజమన్నారు. అనంతరం రైతులు తహసీల్దార్‌ సునీతకు వినతిపత్రం అందజేశారు. అనంతరం తహసీల్దార్‌ మాట్లాడుతూ గతంలో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ధర్మగంట శీర్షికన దొంగ పట్టాల గురించి కథనాలు రావడంతో 336 ఎకరాలను తొలగించామని అన్నారు. ఫిబ్రవరి మొదటి వా రంలో మోకాపై సర్వే చేయించి, మార్చి 15 వరకు సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రేమ్‌నగర్‌ సర్పంచ్‌ ముకులోత్‌ రమ్య, ఉప సర్పంచ్‌ కత్తెర్ల వెంకటస్వామి, రైతులు పాల్గొన్నారు.   

VIDEOS

logo