వన దేవతల పండుగొచ్చె..!

- వచ్చే నెల 24నుంచి ‘మినీ మేడారం’ జాతర
- తేదీలను ఖరారు చేసిన పూజారులు
- నాలుగు రోజుల పాటు నిర్వహణ
- 27తో ముగియనున్న కార్యక్రమాలు
- అప్పుడే మొదలైన భక్తుల సందడి
వన దేవతలు సమ్మక్క-సారలమ్మ పండుగకు ముహూర్తం ఖరారైంది. తేదీ మాఘ శుద్ధ పౌర్ణమి నాడు మినీ మేడారం జాతర(మండమెలిగె పండుగ) నిర్వహించాలని ఆదివారం పూజారులు నిర్ణయించారు. ఈమేరకు అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో సమావేశం కాగా, 24న గుడి శుద్ధీకరణ, ఆ తర్వాత గ్రామ ద్వార బంధనం, 25న అమ్మవార్లకు పసుపు, కుంకుమలతో అర్చన, 26న దర్శనం, 27న ముగింపు కార్యక్రమాలుంటాయని వారు వెల్లడించారు. జాతర తేదీలు ప్రకటించడంతో ఇప్పటినుంచే మేడారంలో భక్తుల సందడి మొదలైంది.
- తాడ్వాయి, జనవరి 17
తాడ్వాయి, జనవరి17: వన దేవతలు సమ్మక్క-సారలమ్మల మినీ జాతర(మండమెలిగే పండుగ)కు వేళయ్యింది. ఫిబ్రవరి 24 నుంచి జాతర నిర్వహించేందుకు ఆదివారం పూజారులు తేదీలను ఖరారు చేశారు. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల ఆలయ పూజారులు మాఘశుద్ధ పౌర్ణమి నాడు మినీ జాతరను నిర్వహించాలని నిర్ణయించారు. 24న ఉదయం సమ్మక్క-సారలమ్మ గుడి శుద్ధీకరణ, అనంతరం గ్రామ ద్వారబంధనం, 25న అమ్మవార్లకు పసుపు, కుంకుమలతో అర్చన, 26న గద్దెల దర్శనం, 27న ముగిం పు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జగ్గారావు మాట్లాడుతూ నిత్యం వచ్చే భక్తుల కోసం గద్దెల పరిసరాల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. జాతర నిర్వహణ తేదీలు ఖరారు కావడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యద ర్శి చందా గోపాల్‌రావు, పూజారులు మునీందర్, కృష్ణ య్య, కాక సారయ్య, భుజంగరావు, మహేశ్, కిరణ్, లక్ష్మణ్‌రావు, నాగేశ్వర్రావు, మేడారం జాతర ధర్మకర్తల మండ లి చైర్మన్ ఆలం రామ్మూర్తి, అనిల్, అరుణ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- అధికారులను కొట్టాలన్న.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై నితీశ్ స్పందన
- సర్కారు బెంగాల్‌కు వెళ్లింది, మేమూ అక్కడికే పోతాం: రైతులు
- ‘మల్లన్న ఆలయంలో భక్తుల సందడి’
- మహిళా ఉద్యోగులకు రేపు సెలవు : సీఎం కేసీఆర్
- ఆ సినిమాలో నా రోల్ చూసి నాన్న చప్పట్లు కొట్టాడు: విద్యాబాలన్
- విడుదలకు ముస్తాబవుతున్న 'బజార్ రౌడి'
- కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి
- ‘కార్తికేయ 2’లో బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్
- టీడీపీ నేతల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైంది : చంద్రబాబు
- పాకిస్తాన్లో హిందూ కుటుంబం దారుణహత్య