సోమవారం 08 మార్చి 2021
Jayashankar - Jan 18, 2021 , 04:52:26

కాళేశ్వరంలో మళ్లీ జల సవ్వడి..

కాళేశ్వరంలో మళ్లీ జల సవ్వడి..

  • కన్నెపల్లి పంప్‌హౌస్‌లో రెండు మోటర్లు ఆన్‌
  • సరస్వతి బరాజ్‌ వైపు ఉరకలెత్తుతున్న గోదావరి జలాలు

కాళేశ్వరం, జనవరి17 : చాలా రోజుల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్లీ జల సవ్వడి కనువిందు చేస్తున్నది. ఉరకలెత్తుతు న్న గోదావరి జలాలను చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ పంప్‌హౌస్‌ (కన్నెపల్లి)లో ఆదివారం 16, 17 మోటర్లు అధికారులు ప్రారంభించడంతో గోదావరి జలాలు ఎగిసిపడుతున్నాయి. గతేడాది ఆగస్టులో భారీ వర్షా లు కురువడంతో పంప్‌హౌస్‌లో మోటర్లను తాత్కాలికం గా నిలిపివేశారు. ప్రభుత్వ ఆదేశాల మేర కు తిరిగి ఆదివారం 16,17 నం బర్‌ మోటర్లను ఆన్‌ చేయగా, గోదావరి జలాలు గ్రావిటీ కెనాల్‌ ద్వారా సరస్వతీ బరాజ్‌కు తరలివెళ్తున్నాయి. కాగా, ఆదివారం పంప్‌హౌస్‌ నుంచి 4,400 క్యూసెక్కుల నీరు గ్రావిటీ కెనాల్‌ గుండా సరస్వతీ బరాజ్‌కు చేరుతుందని అధికారులు తెలిపారు.


VIDEOS

logo