గురువారం 25 ఫిబ్రవరి 2021
Jayashankar - Jan 18, 2021 , 04:49:38

భూపాలపల్లి అష్టదిగ్బంధనం

భూపాలపల్లి అష్టదిగ్బంధనం

  • జిల్లా కేంద్రంలో పోలీసుల విస్తృత తనిఖీలు

భూపాలపల్లి, జనవరి 17 : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని ఆదివారం సాయంత్రం పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐ వాసుదేవరావు ఆధ్వర్యంలో భూపాలపల్లి, గణపురం, చిట్యాల ఎస్సైలు,70 మంది సివిల్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి విస్తృత తనిఖీలు చేశారు. జాతీయరహదారి, షాపులు, పలు కాలనీల్లో పోలీసులు సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే వదిలి పెట్టారు. మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే అనుమానంతోనే ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

VIDEOS

logo