బుధవారం 24 ఫిబ్రవరి 2021
Jayashankar - Jan 18, 2021 , 04:47:21

బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

చిట్యాల, జనవరి 17 : కాల్వపల్లి గ్రామానికి చెందిన బాలె ఐలయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా అదే గ్రామానికి చెందిన పంచిక మహేశ్‌ ఆదివారం మృతుడి కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థికసాయం, 50 కిలోల బియ్యం అందజేశారు. అలాగే రామచంద్రాపురం గ్రామానికి చెందిన క్యాతం కుమారస్వామి మృతి చెందగా అతడి పదో తరగతి మిత్రులు మృతుడి కుమార్తెలు అను, జాను పేర్లపై రూ.76,300 పోస్టాఫీస్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల నరేశ్‌, క్యాతం సతీశ్‌, జెట్టి కుమార్‌, గుర్రం తిరుపతి, శ్రీనివాస్‌, కిరణ్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo