శనివారం 27 ఫిబ్రవరి 2021
Jayashankar - Jan 17, 2021 , 03:15:27

మద్యం మత్తులో అన్నను చంపిన తమ్ముడు

మద్యం మత్తులో అన్నను చంపిన తమ్ముడు

మంగపేట, జనవరి16 : మద్యం మత్తు లో అన్నను తమ్ముడు చంపిన ఘటన ము లుగు జిల్లా మంగపేట మండలం బాలన్నగూడెం పంచాయతీ పరిధిలోని నరేందర్‌రావుపేటలో శనివారం రాత్రి చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. నరేందర్‌రావుపేటకు చెందిన కల్తీ నవీన్‌ (27), నాగబాబు ఇద్దరు అన్నదమ్ములు. తాగిన మైకంలో ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆవేశంతో నాగబాబు తన అన్న నవీన్‌ తలపై కర్రతో బలంగా కొట్టడం తో అక్కడికక్కడే మృతి చెందాడు. విష యం తెలుసుకున్న ఏటూరునాగారం సీఐ కిరణ్‌కుమార్‌ సిబ్బందితో సంఘటనా వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 


VIDEOS

logo