శనివారం 27 ఫిబ్రవరి 2021
Jayashankar - Jan 17, 2021 , 03:15:23

ప్రారంభ తేదీని ప్రకటిస్తాం

ప్రారంభ తేదీని ప్రకటిస్తాం

  • న్యాయమూర్తి నర్సింగరావు

కృష్ణకాలనీ, జనవరి 16 : హైకోర్టు ఆదేశాల మేరకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎనిమిదవ అదనపు కోర్టు ప్రారంభ తేదీని ప్రకటిస్తామని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు అన్నారు. జిల్లా కేంద్రంలో నూతన కోర్టు భవన మరమ్మతు పనులను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కోర్టు భవన మరమ్మ తు పనులు పూర్తయినట్లు ఆర్‌ అండ్‌ బీ అధికారులు తమకు లేఖ ఇచ్చారని అన్నా రు. ఈ నెల 25 లేదా 26 తర్వాత జిల్లాలోని ప్రజలకు పూర్తి స్థాయి న్యాయసేవ లు అందిస్తామన్నారు. జడ్జి వెంట మొ దటి అదనపు జిల్లా న్యాయమూర్తి జ యకుమార్‌, పరకాల ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి హుస్సేన్‌, న్యాయవాదులు శ్రీనివాసాచారి రాకేశ్‌, రాజ్‌కుమార్‌, చిరంజీవి ఉన్నారు.

VIDEOS

logo