మంగళవారం 02 మార్చి 2021
Jayashankar - Jan 16, 2021 , 02:11:05

జిల్లాకు చేరిన కరోనా వ్యాక్సిన్‌

జిల్లాకు చేరిన కరోనా వ్యాక్సిన్‌

  • నేటి నుంచి వైద్యసిబ్బందికి వ్యాక్సినేషన్‌
  • భూపాలపల్లిలో ప్రారంభించనున్న ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లిటౌన్‌, జనవరి 15: కరోనా వ్యాక్సిన్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చేరింది. ప్రభుత్వం సరఫరా చేసిన వ్యాక్సిన్లను జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ ఉమాదేవి స్థానిక పీహెచ్‌సీలో గురువారం భద్రపరిచారు. మొత్తం 56 వాయిల్స్‌ (560 డోసులు) జిల్లాకు వచ్చాయని తెలిపారు. ఎస్సై నరేశ్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. శనివారం నుంచి రోజుకు 30 మంది చొప్పున పంపిణీ చేయ నున్నారు. జిల్లాలో 14 కేంద్రాల ద్వారా 2191 మందికి వ్యాక్సినేషన్‌ చేయనున్నారు. భూపాలపల్లి, చిట్యాల, మహదేవ్‌పూర్‌ సీహెచ్‌సీల ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్‌ చేయనున్నా రు. భూపాలపల్లి పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జేసీ స్వర్ణలత, ప్రారంభిస్తారని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధార్‌సింగ్‌ తెలిపారు. చిట్యాల సీహెచ్‌సీలో ఎంపీపీ, జడ్పీటీసీ, మహదేవపూర్‌లో మంథిని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, భూపాలపల్లి జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి, భూపాలపల్లి ఆర్డీవో హాజరై ప్రారంభిస్తారన్నారు.

 గట్టమ్మ పాదాల చెంత ..

ములుగురూరల్‌ :  రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేయగా ములుగు జిల్లాకు చేరుకుంది. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ అల్లెం అప్పయ్య, ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌ డాక్ట ర్‌ శ్యాంసుందర్‌, ఎస్సైలు హరికృష్ణ, డీవీ ఫణి వాటిని గట్టమ్మతల్లి పాదాల చెంత పెట్టి పూజలు చేశారు. వ్యాక్సినేషన్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి గురువారం వైద్యాధికారులకు సూచించారు.

VIDEOS

logo