Jayashankar
- Jan 16, 2021 , 02:11:04
VIDEOS
ఘనంగా గోదాదేవి కల్యాణం

రేగొండ, జనవరి 15 : పవిత్ర పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గోదా దేవి కల్యాణ వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. మండలంలోని కోడవటంచ గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ ఇంగె మహేందర్, కార్యనిర్వహణాధికారి సులోచన, ధర్మకర్తలు, గైని కూమారస్వామిపాల్గొన్నారు.
ములుగుటౌన్ : జిల్లా కేంద్రంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో రంగనాయక స్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ముఖ్య అథితిగా ములుగు ఏఎస్పీ సాయిచైతన్య హాజరై పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గండ్రకోట కుమార్, సుతారి సతీశ్, బాబురావు, తిరుపతి, శ్రీను సంపత్, విజేందర్, రాజన్న, మహేందర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING