ముదిరాజ్‌ల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి

- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కృష్ణకాలనీ, జనవరి 13: తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజ్ కులస్తుల సంక్షేమానికకి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. అన్నారు. 18 ఏళ్లు నిండిన ముదిరాజ్ కులస్తులు ఎలాంటి షరతులు లేకుండా మత్స్యకార సహకార సంఘంలో సభ్యత్వం పొందవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీవోను స్వాగతిస్తూ బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు జోరుక సదయ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గండ్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మత్స్య కారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కొత్త జీవోను తీసుకువచ్చారన్నారు. పాత జీవో ప్రకారం మత్స్యకార సొసైటీలో సభ్యత్వం పొందాలంటే చెరువులో 20 గుంటల భూమి ఉండాలని, అన్నిరకాల స్కిల్ టెస్ట్‌ల్లో ఉత్తీర్ణులు కావాలని, మత్స్యకార ఆఫీసులో ఉండే అధికారులు ముదిరాజ్‌లను అనేక ఇబ్బందులు పెట్టేవారని అన్నారు. ఇప్పటి వరకు 50 ఏండ్లు వయస్సు దాటినప్పటికీ ఏఒక్క ముదిరాజ్ కులస్తుడు కూడా మత్స్య సొసైటీలో సభ్యత్వం పొందలేదన్నారు. చెరువులో భూమి లేకున్న, స్కిల్ టెస్ట్‌లో ఉత్తీర్ణులు కాకున్నా 18 ఏళ్లు నిండిన గంగపుత్ర, తెనుగు, గూండ్ల, బెస్త, ముతరాసీ, ముదిరాజ్ కులస్తులు రూ.51 మాత్రమే చెల్లించి మత్స్యకార సొసైటీలో సభ్యత్వం పొందవచ్చని ప్రభుత్వం కొత్త జీవోను తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. అంతేకాకుండా ముదిరాజ్ కులస్తులకు భవన నిర్మాణం కోసం ఐదెకరాల భూమిని ప్రభుత్వం అందజేసిందని అన్నారు. అనంతరం ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు జోరుక సదయ్య, భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, భూపాలపల్లి సొసైటీ చైర్మన్ కోసరి యాదగిరి, జిల్లా నాయకులు రాజమౌలి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కాటారం, జనవరి 13: తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో కాటారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ ముదిరాజ్, పెద్దపల్లి, భూపాలపల్లి జడ్పీ చైర్మన్లు పుట్ట మధు, జక్కు శ్రీహర్షిణి రాకేశ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్ మహాసభ మంథని నియోజకవర్గ ఇన్చార్జి రమేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సీరం ఇన్స్టిట్యూట్లో మళ్లీ మంటలు..
- అనుష్క కెరీర్ డల్ అయిపోయిందా..?
- ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ఏసీబీ వలలో కుందనపల్లి వీఆర్వో
- సిరాజ్‌ను సన్మానించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- రిలయన్స్ 22-26 మధ్య డిజిటల్ ఇండియా సేల్.. డిస్కౌంట్లు.. ఆఫర్లు
- ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్లు లేవు..కారణమేంటో ?
- మహేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!
- ఏనుగు మరణం.. వెక్కివెక్కి ఏడ్చిన అటవీ రేంజర్
- సీతారామ ప్రాజెక్టు పనుల వేగవంతానికి సీఎం కేసీఆర్ ఆదేశం