సోమవారం 25 జనవరి 2021
Jayashankar - Jan 14, 2021 , 01:41:41

భూపాలపల్లి ఆర్టీసీ డిపో తనిఖీ

భూపాలపల్లి ఆర్టీసీ డిపో తనిఖీ

భూపాలపల్లి టౌన్‌, జనవరి 13: భూపాలపల్లి ఆర్టీసీ డిపోను రీజినల్‌ మేనేజర్‌ ఎస్‌వీజీ కృష్ణమూర్తి బుధవారం తనిఖీ చేశారు. ఆర్‌ఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారి భూపాలపల్లి ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాక్‌డౌన్‌ అనంతరం భూపాలపల్లి డిపో ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి వెళ్తున్నదని, కార్మికులు మరింత కష్టపడి పనిచేసి డిపోను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. కేఎంపీఎల్‌తోపాటు ఆక్యుపెన్సీ రేషియో శాతం పెంచుకోవాలని సూచించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కను నాటారు. డిపోలో బస్సులు, కార్మికుల సంఖ్య, బస్సు పరిస్థితి, రూట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డిపో మేనేజర్‌ లక్ష్మీధర్మ, అధికారులు ఉన్నారు.logo