ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jayashankar - Jan 13, 2021 , 01:54:22

ఇటుకల బట్టీ కూలీల ఫిర్యాదుపై విచారణ

ఇటుకల బట్టీ కూలీల ఫిర్యాదుపై విచారణ

రేగొండ, జనవరి 12 : తక్కువ కూలి చెల్లిస్తున్నారంటూ నిజాంపల్లె గ్రామానికి చెందిన ఇటుకల బట్టీ నిర్వాహకుడు సందేల మధుకర్‌పై కూలీలు ఫిర్యాదు చేయగా సోమవారం పరకాల ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి హుస్సేన్‌ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఒడిస్సాకు చెందిన కూలీలు పని చేస్తున్నారు. కూలిలతో జడ్జి మాట్లాడి వివరాలు సేకరించించారు. అనంతరం నిర్వాహకులను విచారించారు. కొంత మంది కూలీలు ఇచ్చిన ఫిర్యాదు నిరాధారణమైనదని, కార్మికులను వారి రాష్టానికి నిర్వాహకులు సొంత ఖర్చులతో పంపిచే ఏర్పాట్లు చేయాలని జడ్జి ఆదేశించారు. 


VIDEOS

logo