బుధవారం 03 మార్చి 2021
Jayashankar - Jan 12, 2021 , 02:53:25

సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలాచూడాలి

సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలాచూడాలి

  • సంయుక్త కలెక్టర్‌ స్వర్ణలత
  • ప్రజావాణిలో వినతుల స్వీకరణ

భూపాలపల్లిరూరల్‌/ ములుగుటౌన్‌, జనవరి11: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా అధికారులు పని చేయాలని సంయుక్త కలెక్టర్‌ కూరాకుల స్వర్ణలత అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ సమస్యలపై జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జేసీ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని, సంబంధిత శాఖల అధికారులు ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలు పేదలకు సకాలంలో చేరేలా చూడాలని, వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయా శాఖలకు వచ్చిన ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాగపద్మజ, డీఆర్డీవో శైలజ, ఎల్డీఎం శ్రీనివాస్‌, డీపీవో సుధీర్‌కుమార్‌, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య, యువజన సర్వీసుల శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమస్యలను పరిష్కరించాలి: ములుగు డీఆర్వో

వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని ములుగు డీఆర్వో కూతాటి రమాదేవి అన్నారు. సోమవారం గ్రీవెన్స్‌ డే సందర్భంగా ములుగు కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ పెండింగ్‌ దరఖాస్తులను సైతం పరిష్కరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్‌కు అధికారులు సకాలంలో హాజరు కావాలని అన్నారు. దరఖాస్తుల పరిష్కారంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీపీవో వెంకయ్య, జడ్పీ సీఈవో ప్రసూనరాణి, మైనింగ్‌ ఏడీ రఘుబాబు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

VIDEOS

logo